నమస్తే శేరిలింగంపల్లి: కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజల కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని, అభివృద్ధికి పట్టం కట్టాలని ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగంపల్లి డివిజన్ బొటానికల్ గార్డెన్ లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.