అనుక్షణం అభివృద్ధిపై దృష్టి పెడతాం

  • ప్రజలకు రుణపడి ఉంటాం, అండగా ఉంటాం
  • చేవేళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన సందర్భంగా మసీద్ బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొని అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రసంగించారు.

శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ సమక్షంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఆదరించిన ప్రజలకు అండగా ఉంటామని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న బిజెపి పార్టీ కార్యకర్తల కోరిక తీరిందని తెలుపుతూ ఇకపై అనుక్షణం అభివృద్ధిపై దృష్టి సాధించి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కంకణం కట్టుకుంటానని పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంటులో అత్యధిక మెజారిటీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రావడం నియోజకవర్గ ఇన్చార్జ్ రవి కుమార్ యాదవ్ కి, మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ కి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు అధ్యక్షులకు మహిళా మోర్చా నాయకులకు యువ మోర్చా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి సన్మానం

ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు సీటును గెలిపించుకోవడానికి శేరిలింగంపల్లి బిజెపి కార్యకర్తలు పడ్డ కృషి వినలేనిదని తెలుపుతూ రేపు జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు గెలుచుకోవాలని, దానికి అనుగుణంగా ఇప్పటి నుండే కష్టపడి పని చేస్తూ ప్రజా సమస్యలపై దృష్టి సాధిస్తామని, దానికి మీ మద్దతు మీ సహకారం శేరిలింగంపల్లిపై ఎప్పుడూ ఉండాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాఘవేంద్రరావు, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, నాగులు గౌడ్, రవీందర్ రావు, నరేష్, నర్సింగ్, భూపాల్ రెడ్డి, ఆంజనేయులు సాగర్, నవీన్ గౌడ్, శ్రీధర్ గౌడ్, మదనాచారి, వినయ, రామరాజు, నవతారెడ్డి, బసంత్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, పద్మ వితసింగ్, మేరీ, రమేష్, నరసింహ చారి, సీతారామరాజు, బాలు యాదవ్, సునీల్ రెడ్డి, పర్వతాలు యాదవ్, శేషయ్య కృష్ణంరాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here