నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న జన్మదినం సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్, పెద్ద అంబర్ పేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ లు యాదగిరి గుట్టలోని బీర్ల ఐలన్నను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గణేష్ గౌడ్, పల్నాటి అశోక్, మహేష్ గౌడ్, విక్రమ్ గౌడ్, వినోద్, నాగరాజు, దీనెష్, రణధీర్ రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.