- ఆపరేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దలు సాయం చేయాలని బాదితుడి వేడుకోలు
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ లోని సాయినగర్ నివాసి బొడిగే సాయిలుకు హఫీజ్ పేట్ నాయకుడు దాత్రీనాథ్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్నారు. వివరాలు పది రోజుల కిందట సాయిలుకి రోడ్డు ప్రమాదంలో నడుము, రెండు కాళ్ళు విరిగిపోయాయి. మమతా హాస్పిటల్ లో చేరగా.. రెండు సార్లు ఆపరేషన్ జరిగింది.
మళ్ళీ నడుముకు ఆపరేషన్ చేయాలని, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని వైద్యలు తెలిపారు. పెయింటర్ గా పనిచేసే సాయిలు మళ్లీ ఆపరేషన్ చేయించే స్థితిలో లేకపోవడంతో… విషయం తెలుసుకున్న హఫీజ్ పేట్ వాస్తవ్యులు దాత్రీనాథ్ గౌడ్ వెంటనే స్పందించి హాస్పిటల్ కు వచ్చి రూ. 25వేలు ఆర్థిక సహాయం చేశారు. తనకు తెలిసినవాళ్ళతో కూడా ఆర్థిక సహాయం చేపిస్తానని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ ప్రచారంలో చాలా చురుకుగా పాల్గొన్నానని, తనకు ఆక్సిడెంట్ జరిగిన విషయం పార్టీ పెద్ద నాయకులకు తెలిపి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ప్రార్థించారు.