నమస్తే శేరిలింగంపల్లి: బాలాజీ నగర్ ఎఫ్ ఓ సి కార్మికులకు, కొత్త జూనియర్ లైన్ మెన్ లకు భద్రత ఏ బి స్విచ్ హ్యాండిల్, ఎర్త్ రాడ్స్ ఇచ్చి భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ సిటీ సర్కిల్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తన జన్మదినం సందర్భంగా పలు సేవాల కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాక ఎర్త్ రాడ్ ప్రాముఖ్యత గురించి తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భద్రత పాటించాలని ప్రతి పనికి భద్రతా పరికరాలను ఉపయోగించాలని కోరారు. నేటి భద్రతే రేపటి ఆనందం !.. పని ఎంత ముఖ్యమో భద్రత అంతే ముఖ్యము !.. ప్రతి జీవికి ప్రాణము ఎంత ముఖ్యమో !.. విద్యుత్ కార్మికుడికి భద్రత అంతే ముఖ్యం !!.. పలు సూచనలు చేశారు. శిల్పా ఎంక్లేవ్ కాలనీలో పార్కు పక్కన మామిడి మొక్కలు నాటారు, ప్రతి ఒక్కరు మొక్కలను నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండని పిలుపునిచ్చారు.