నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, శిల్ప ఎంక్లేవ్, గౌతమి నగర్, గంగారం హరిజన బస్తి, అన్నపూర్ణ ఎంక్లేవ్ లో బిఆర్ఏస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాలతో కలిసి చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలు ఇంటింటి ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డీ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో జరిగిన అభివృద్ధి.. గత తొమ్మిది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని బేరిజు వేసుకొని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అండర్ పాసులు, లింకు రోడ్లు, ప్లైఓవర్ లు, కాలనిలల్లో పార్కులు, సిసిరోడ్లు, మిషన్ భగీరథ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఏస్ పార్టీ నాయకులు కాలనీ వాసులు చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాధ్ రెడ్డి, రవీందర్ రావు, లక్ష్మి నారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, వెంకటేశం, పులిపాటి నాగరాజు, ధనలక్ష్మి, గోవర్ధన రెడ్డి , అక్బర్ ఖాన్, యూసుఫ్ , శ్రీకాంత్, ఎల్లమయ్య, నరేందర్ బల్లా, రాజశేఖర్ రెడ్డి, దీక్షిత్, రాహుల్, యర్వ వెంకటేశ్, వెంకటేశం, ప్రసాద్, లింగారెడ్డి, నాగార్జున్ రావు పాల్గొన్నారు.