- కెనరా ది స్కూల్లో వేడుకగా బాలల దినోత్సవం
- సందడిగా కొనసాగిన సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: నక్షత్రంలా ప్రకాశవంతంగా ప్రకాశింపజేసేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కెనెరా ది స్కూల్ పాఠశాల ఛైర్‌పర్సన్ చప్పిడి శ్వేతారెడ్డి చప్పిడి తెలిపారు.
పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించి వారి బాల్యం మధురమైన జ్ఞాపకంగా ఉండేలా ఆ స్కూల్లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ చాటారు. ఈ వేడుకను పురస్కరించుకుని పాఠశాల ఛైర్‌పర్సన్ ‘బాల్యం’ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నిశీదిలోని నక్షత్రంలా ప్రకాశవంతంగా విద్యార్థులను ప్రకాశింపజేయడంలో సహాయపడటానికి కెనరీ ఉపాధ్యాయులచే ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరిలో పసితనాన్ని సజీవంగా ఉంచుకునే ప్రాముఖ్యతను ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ సీనియర్ స్కూల్ Mr. నవీన్ ఇమ్మడి పాల్గొని విద్యార్థులకు వారి సందేశాన్ని అందించి శుభాకాంక్షలను తెలిపారు. ఉపాధ్యాయులు నాటికలు, నృత్యాలు పాటలు పాడుతూ పిల్లలను ఆనందపరిచారు.