- హాజరై మాట్లాడిన మంత్రి కేటీఆర్
- మళ్ళీ గాంధీనే గెలిపించుకుందామని పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నిర్వహించిన రోడ్డు షో కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

అయితే తార నగర్, ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మబండలో నిర్వహించిన రోడ్డు షో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీకి మరింత బలం చేకూర్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని 9వేల కోట్లతో అభివృద్ధి చేశారని, మళ్ళీ గాంధీనే గెలిపించుకుందామని తెలిపారు.

ఆయనతోపాటు ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, మాధవరం రోజాదేవి రంగరావు, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రచారాన్ని కొనసాగించారు.
