నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట డ్వాక్రా సంఘాలతో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద మహిళలకు ఇస్తున్న కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ , ఒంటరి మహిళకు పెన్సన్ పథకాలు గురించి వివరించారు. 30 తేదీన మీ అమూల్యమైన ఓటును మీ కుటుంబ సభ్యులతో కారు గుర్తుకు వేయించి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యె గా అరెకపూడి గాంధీని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు.