యువత చూపు.. బిఆర్ఎస్ వైపే

నమస్తే శేరిలింగంపల్లి: యువత మద్దతు బిఆర్ఎస్ పార్టీకే ఉందని చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని బిజెపి పార్టీకి చెందిన శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ (ఆర్టిఐ) వంశీ కృష్ణ  అతని అనుచరులు భారీ ర్యాలీతో వచ్చి.. చందానగర్ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరారు.

పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్న మంజుల రఘునాథ్ రెడ్డి

అల్ అన్సారీ కమిటీ సభ్యులు, అల్ అన్సారీ కమిటీ అధ్యక్షులు అలి,  భవానిపురం వికర్ సెక్షన్ కాలనీకి చెందిన యువ నాయకులు దాదాపు ఐదు వందల మంది యువకులు చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి  చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి చందానగర్ డివిజన్ బిఆర్ఎస్  పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి  కండువా కప్పి స్వాగతం పలికారు.

పార్టీలో చేరుతున్న వారికి కండువా కప్పుతూ

ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి  మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, ఇప్పటికే ప్రపంచంలోని ఐటీ అగ్రగామి సంస్థలు హైదరాబాద్ లో కంపెనీలు స్థాపించాయన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతి సాధించడం జరిగిందన్నారు. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అభివృద్ధిని చూసి యువత బిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుందన్నారు. అనంతరం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రగామి సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ లో ఎటుచూసిన అభివృద్ధి కనపడుతుందని.. పేద ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాఘవరావు, రఘుపతిరెడ్డి, రవీందర్ రావు, లక్ష్మినారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, గురుచరణ్ దూబె, పులిపాటి నాగరాజు, లక్ష్మారెడ్డి, ఓర్సు వెంకటేశ్వర్లు, పబ్బ మల్లేష్, ప్రవీణ్, వెంకట్ రావు, అక్బర్ ఖాన్, యూసుఫ్, ఎల్లమయ్య, పారునంది శ్రీకాంత్, అంజద్, రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రాహుల్, ఉదయ్, యశ్వంత్, వెంకటేశ్, మున్న, ఆఫ్రోజ్, యండి ఫయాజ్, మహ్మమద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here