- ఉత్సాహంగా బిఆర్ ఎస్ ఇంటింటి ప్రచారం
- పార్టీ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించిన కార్పొరేటర్ హమీద్ పటేల్
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఆ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ప్రతి గడపగడపకు వెళ్లి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాంధీని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఓటర్లను అభ్యర్థించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్, ఆంధ్ర బస్తీ, కుమ్మరి బస్తీ, వినాయక నగర్ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులతో కలసి గడప గడపకు తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కలసి పార్టీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందించారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, వేరే ఏ పార్టీకి ఓటు వేసిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే గల్లీ పాలన ఉంటుందని, వేరే ఏ పార్టీకి ఓటు వేసిన ఢిల్లీ పాలన ఉంటుందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి గాంధీ హయాంలో అద్భుతంగా జరిగిందన్నారు. ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే గాంధీ అన్నని గెలిపించాలని కోరారు. ఓటరు జాగ్రత్తగా, తెలివిగా ఆలోచించి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాంధీని అఖండ మెజారిటీతో గెలుపించుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు.
కొండాపూర్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జె. బలరాం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమత, మల్లెల శ్రవణ్ యాదవ్, మల్లెల రాజు యాదవ్, ఎన్. రూపారెడ్డి, గౌరీ, సిల్వర్ కుమ్మరి శ్రీనివాస్, కిరణ్, సిల్వర్ కుమ్మరి రాకేష్, రవి గౌడ్, రవి శంకర్ నాయక్, రజనీకాంత్, తిరుపతి పటేల్, గంగారాం యాదవ్, తిరుపతి యాదవ్, అశోక్ సాగర్, మీనా భి, పర్వీన్, డా. సుదర్శన్, సాయి శామ్యూల్ కుమార్, సంధ్య, లావణ్య, మౌనిక, అంజలి, కవిత సలీం, అబ్దుల్ రెహమాన్, సోమరాజు, నాగేష్, బాబు, పూజ, సయ్యద్ ఉస్మాన్, ఖలీం, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.