- ఎన్నికల ప్రచారంలో మంగళ హారతులతో ఎమ్మెల్యే గాంధీకి అడుగడుగునా మహిళ సోదరీమణుల, నీరాజనం
నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గాంధీ చేపట్టిన ఇంటింటి ప్రచారానికి అపూర్వ స్వాగతం లభించింది. మంగళ హారతులతో మహిళామణులు అడుగడుగునా స్వాగతంం పలికారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండా, సర్వే ఆప్ ఇండియా, అయ్యప్ప సొసైటీ, సాయినగర్, మెగా హిల్స్, హరిజన బస్తీ, సాయి నగర్ తండా, అరుణోదయ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టి అనంతరం మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.
