ప్రజారంజకం బిఆర్ఎస్ మ్యానిఫెస్టో 2023: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో 2023 ప్రజరంజకంగా ఉందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడించి రూపొందించిన మ్యానిఫెస్టో- 2023 శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా ఉందని , సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యమని, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. ప్రతిపక్షాల ఊహ కందని విధంగా రూపొందించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, రైతు బాంధవుడు, మహిళల పక్షపాతి అని, ఈ మ్యానిఫెస్టో ప్రజలకు మరింతగా చేరువయ్యేలా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమం , అభివృద్ధికి సమ ప్రాధాన్యత కల్పించారని తెలిపారు.

  • బీఆర్ఎస్ మ్యానిఫెస్టో 2023
  • ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు.
  • అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
  • తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం
  • రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం
  • ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు
  • అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
  • వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంపు
  • రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు
  • మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇస్తాం.
  • అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3000 అందిస్తాం.
  • అర్హులైన లబ్దిదారులకు, అని అక్రిడేశన్ కలిగిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని సిఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here