- ఎస్ టి పి నిర్మాణం సందర్షించిన ప్రభుత్వ విప్ ఆరికపూడి గాంధీ
- సభ ప్రంగాణంలో మొక్కలు నాటిన గాంధీ .
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జె.పి.యన్ నగర్ కమ్యూనిటీ హాల్ లో మంచి నీళ్ల పండుగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ వెంకన్న, జలమండలి జీఎం రాజశేఖర్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, పూజితజగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మంచి నీళ్ల పండుగ కార్యక్రమంలో భాగంగా జలమండలి అధికారుల తో కలిసి మియాపూర్ లో నిర్మిస్తున్న STP ని సందర్శించి, STP నిర్మాణం పనులు తీరుతెన్నులను అడిగి తెలుసుకుని, మొక్కలు నాటారు.
తదనంతరం బారీ ర్యాలీగా సభ ప్రాంగణం కు చేరుకొని అక్కడ సభ ప్రాంగణంలో ఇంకుడు గుంతను తవ్వి , ఇంకుడు గుంత ప్రాముఖ్యత ను వివరించారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల ఫొటో ఎక్జిబిషన్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డిజిమ్ నాగప్రియ, శరత్ రెడ్డి, మేనేజర్లు సుబ్రమణ్యం, యాదయ్య, నరేందర్ రెడ్డి, సందీప్, అభిషేక్ రెడ్డి, పూర్ణేశ్వరి,సాయి చరిత, మనసా, ప్రశాంతి, ప్రియాంక, ఝాన్సీ మరియు మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, విరేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.