హ్యాట్రిక్ తో పాటు 5 వికెట్లు తీసిన ఖుష్ అగర్వాల్

  • హెచ్ సీ ఏ బి డివిజన్ మ్యాచ్ లో సత్య సాయి సిసి క్రికెటర్ ప్రతిభ

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెచ్ సి ఏ బి డివిజన్ 2 రోజుల లీగ్ మ్యాచ్ లలో హైదరాబాద్ జట్టు స్పిన్ బౌలర్ ఖుష్ అగర్వాల్ అత్యుత్తమ ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాయి సత్య సీసీ వర్సెస్ మెదక్ జిల్లా సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన మెదక్ జిల్లా సీసీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. సాయిసత్య సీసీ లెగ్ స్పిన్నర్ ఖుష్ అగర్వాల్ బౌలింగ్ ధాటికి బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు.

కుష్ అగర్వాల్

అగర్వాల్ అద్భుతమైన బౌలింగ్ తో మొట్ట మొదటి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో మెదక్ జిల్లా జట్టు 220 పరుగులకు ఆలౌట్ అయింది. ఖుష్ అగర్వాల్ 16 ఓవర్లు బౌలింగ్ చేసి 49 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడమే కాకుండా అందులో హ్యాట్రిక్ వికెట్లు సాధించడం విశేషం. అంతేకాకుండా 6 మెయిడెన్ ఓవర్లు వేసి కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

మ్యాచ్ స్కోర్ షీట్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here