- ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్లోని మదీనాగూడలో ఆదివారం సాయి కృప అపార్ట్ మెంట్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ బండి రమేష్ పాల్గొని మాట్లాడారు. కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ సమస్య, మెట్రో స్టేషన్ విస్తరణ, సర్వీస్ రోడ్డు, ఓపెన్ జిమ్, అమ్మవారి టెంపుల్ నిర్మాణం తదితర సమస్యలను అపార్ట్మెంట్ వాసులు బండి రమేష్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు .
ఈ సందర్భంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థి మనస్విని సమస్య తెలుసుకుని వెంటనే స్పందించి చదువుల కోసం ఆర్థిక సాయం అందించారు. అనంతరం మనస్విని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అపార్ట్ మెంట్ వాసులు బండి రమేష్ ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి, సురేష్, రవి చందర్ పాల్గొన్నారు.