మూడేండ్ల చిన్నారి సమద్ కుటుంబానికి పరామర్శ

  • లక్ష ఆర్థిక సాయం అందించిన మాజీ మంత్రి కేటీఆర్

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షానికి రేకుల షెడ్డు కూలిన ఘటన మనకు తెలిసిందే. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి సమద్ మృతి చెందగా, సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి, లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.

సాయి నగర్ కాలనీలో చిన్నారి సమద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్, పక్కన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

వీరి వెంట కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్లారు. ఇదే ఘటనలో మరణించిన రషీద్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు .
ఈ సందర్భంగా కేటీఆర్, ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈ ఘటన చాలా దురదృష్టకరం, బాధాకరమని, బాలుడి మృతి మమ్మల్ని ఎంతగానో కలిచివేసిందన్నారు.

సమద్ ఇంటి లో జరిగిన ఘటనను పరిశీలిస్తున్న కేటీఆర్

బాలుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

చిన్నారి సమద్ కుటుంబానికి ధైర్యం చెబుతూ..

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్ష రూపాయల సాయం అందిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here