కొండాపూర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మహిపాల్ యాదవ్

సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ తదితరులు
  • అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్

కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేట‌ర్ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో శేరిలింగంప‌ల్లి కాంగ్రేస్ పార్టీ ముందడుగు వేసింది. మిగిలిన పార్టీల్లో అభ్య‌ర్థుల విష‌యాల్లో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతుంటే కాంగ్రేస్ పార్టీ ఏకంగా ఒక అభ్య‌ర్థి పేరును ప్ర‌క‌టించేసింది. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా యూత్ కాంగ్రెస్ నాయకుడు మహిపాల్ యాదవ్ ఖరారయ్యారు. సోమవారం కొండాపూర్ లో నిర్వహించిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఎం.బిక్షపతి యాదవ్, నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ లు మహిపాల్ యాదవ్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ డివిజన్ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు మహిపాల్ యాదవ్ కు అవకాశం ఇచ్చామని, ఎంతో కాలంగా పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాడని తెలిపారు. పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకుదు భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ లతో పాటు పార్టీ నాయకులకు మహిపాల్ యాదవ్ కృతఙ్ఞతలు తెలిపారు. కొండాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూ కొండాపూర్ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.

మహిపాల్ యాదవ్

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోడిచెర్ల టి.కృష్ణ, కృష్ణయాదవ్, అల్లాఉద్దీన్ పటేల్, యూసుఫ్, గౌస్ బాయ్, అమీర్, నరసింహ, రేఖ, లక్ష్మి, గణపతి రావు, జావేద్ ఇమ్రోజ్ బసవరాజు, సాయి, కృష్ణ యాదవ్, గోపాలకృష్ణ, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here