
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భరతీయ జనతాపార్టీ శేరిలింగంపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు అందెల కుమార్ యాదవ్ సోమవారం బిజెపి రంగారెడ్డి జిల్లా(అర్భన్) అధ్యక్షుడు సామ రంగారెడ్డికి బయోడెటాను అందజేశారు. అఖిల భారత యాదవ మహసభ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా గత దశాబ్ధకాలంగా కొనసాగుతున్నానని, 2015లో బిజెపి రాష్ట్ర నాయకులు నందకుమార్ ఆద్వర్యంలో బిజెపిలో చేరానని తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్‌లో అన్ని వర్గాల ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, తనకు అవకాశం కల్పిస్తే భారీ మెజారిటీతో గెలచివస్తానని కుమార్ యాదవ్ తెలిపారు. సామరంగారెడ్డిని కలిసిన వారిలో బిజెపి రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ఇద్దరు యాదవుల మధ్య పోరు..?
అందెల కుమార్ యాదవ్ అభ్యర్థిత్వం పట్ల బిజెపి అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. శేరిలింగంపల్లి డివిజన్ నుంచి ప్రస్థుతం ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార పార్టీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, బిజెపి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న అందెల కుమార్ యాదవ్‌లు ఇరువురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. శేరిలింగంపల్లి డివిజన్‌లో యాదవ్‌ల సంఖ్య హెచ్చుగా ఉంటుంది. దానికి తోడు కుమార్ యాదవ్ గత దశాబ్ధ కాలంగా అఖిల భారత యాదవ మహాసభలో కీలక భాద్యతలు నిర్వహిస్తున్నాడు. సిట్టింగ్ కార్పొరేటర్‌ను తట్టుకోవాలంటే అదే సామాజికవర్గంలోని యువ నాయకుడికి అవకాశం ఇస్తే లాభపడొచ్చు అనే కోణంలో పార్టీ ఆలోచిస్తుందని సమాచారం. అదే జరిగితే శేరిలింగంపల్లి డివిజన్‌లో ఇద్దరు యాదవుల మధ్య గట్టి పోటీ ఖాయం.





