శేరిలింగంప‌ల్లిలో చురుగ్గా అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

వివేకానంద‌న‌గ‌ర్/ ఆల్విన్ కాల‌నీ/ హైద‌ర్‌న‌గ‌ర్/మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లు డివిజ‌న్ల‌లో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ సోమ‌వారం ప‌లు ప్రాంతాల్లో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు.

ఆల్విన్ కాలనీ ఫేజ్ – 1 లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ, కార్పొరేటర్ లక్ష్మీ బాయి

వివేకానంద నగర్ డివిజన్ లో…
డివిజ‌న్‌ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్ – 1 లో వాట‌ర్‌ బోర్డు నిధులు రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ లక్ష్మీ బాయితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజీఎం వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, రామారావు, అంజిరెడ్డి, ఆంజనేయులు, మోహన్ రావు, సత్యనారాయణ, శాస్త్రి, బాబు, మనోహర్, శేఖర్, మురళి, రమణా రెడ్డి పాల్గొన్నారు.

విజయ నగర్ లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఆల్విన్ కాలనీ డివిజన్ లో..
డివిజ‌న్ ప‌రిధిలోని విజయ నగర్ లో వాట‌ర్‌ బోర్డు నిధులు రూ.60 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజీఎం వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, సంతోష్ రావు, కాశీనాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, షాకత్ అలీ మున్నా, వెంకట్ నాయక్, మురళి, భూపాల్ రెడ్డి, సాయి, చంద్ర శేఖర్, వాసు, అంజలి, శిరీష, స్వరూప పాల్గొన్నారు.

హైదర్ నగర్ డివిజన్ లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ, కార్పొరేటర్ జానకి రామరాజు

హైదర్ నగర్ డివిజన్ లో..
డివిజ‌న్‌ పరిధిలోని హెచ్ఎంటీ హిల్స్, హెచ్ఎంటీ శాతవాహన, ఆదిత్య నగర్, అల్లాపూర్ సొసైటీలలో వాట‌ర్ బోర్డు నిధులు రూ.7 కోట్ల 87 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జానకి రామరాజుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజీఎం వెంకటేశ్వర్లు, డివిజన్ తెరాస అధ్యక్షుడు నార్నె శ్రీనివాస రావు, తెరాస నాయకులు దామోదర్ రెడ్డి, కోనేరు కృష్ణ ప్రసాద్, పోతుల రాజేందర్, సుబ్బరాజు, రంగరాయ ప్రసాద్, అష్రాఫ్, సద్దాం, రాజు సాగర్, సత్యనారాయణ, కృష్ణ కుమారి, విమల, పర్వీన్, కాలనీ వాసులు ఉమామహేశ్వర్ రావు, యాదవ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామకోటేశ్వర్ రావు, సదానందం, అందే నర్సింహా, బోస్ రెడ్డి, వెంకట నర్సయ్య పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజ‌న్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ డివిజ‌న్‌లో…
మాదాపూర్ డివిజన్ లో రూ.8 కోట్ల 10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో క‌లిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీఈ రూప దేవి, ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, మల్లేష్, శర్మ, డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు సాంబ‌శివరావు, శ్రీనివాస్ గౌడ్, వాసు, గుమ్మడి శ్రీను , బ్రిక్ శ్రీను, సాంబయ్య, పితాని శ్రీనివాస్, హూన్య నాయక్, కాలనీ వాసులు పెద్ద మధుసూదన్ రెడ్డి, భిక్షపతి, కేవీ రావు, చిన్న మధుసూదన్ రెడ్డి, పరమేశ్వర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here