- ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది : శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువుల అన్యాక్రాంతం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా స్పష్టమైన అవగాహన ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రతి డివిజన్ అభివృద్ధే ద్యేయంగా ప్రతి అడుగు ముందుకు వేస్తామని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని శంశిగుడా, సాయి చరణ్ కాలనీ, శ్రీరాం నగర్, కృష్ణ వేణి కాలనీ, సాయి ప్రశాంత్ నగర్ కాలనీ ఇంద్రహిల్స్ లో నెలకొన్న వాటర్, డ్రైనేజ్, రోడ్, వీధి స్తంభాల సమస్యలపై స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రశాంతి, డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, నాయకులు మనెపల్లి సాంబశివరావు, ప్రభాకర్, రూబెన్ గోపాల్, లింగం, సంగారెడ్డి, సుధాకర్, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.