నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీ లో రూ. 17 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయంతో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో నూతనంగా నిర్మించిన మహిళ భవనంను ప్రారంభించారు. ఈ భవనాన్ని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ సమగ్ర , సంతులిత అభివృద్ధి లో భాగంగా వేముకుంట కాలనీ వాసులు, మహిళ సోదరీమణుల విజ్ఞప్తి మేరకు మహిళ భవనం నిర్మాణం కోసం ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ ద్వారా రూ. 17 లక్షల 50 వేలను ఎమ్మెల్యే (CDP FUNDS ) నుండి మంజూరు చేసామని తెలిపారు. తన దృష్టికి ఏ చిన్న సమస్య వచ్చిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, అక్బర్ ఖాన్, రాంచందర్, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మీ, రాజశేఖర్ రెడ్డి, నరేందర్ బల్లా, అంజద్ ,సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.