చందానగర్ లో ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి:  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపంలో మహిళా సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీ వెంకన్న, డీసీ సుధాంష్, సిడిపివో లక్ష్మీ బాయి, డిఆర్ డి ఏ ఏ పివో శ్వేతా, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉషారాణి, ఇంద్రసేన తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహిళ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్, అమ్మఒడి వాహనాలు, ఆరోగ్య లక్ష్మి, షి టీమ్స్, భరోసా, సఖి కేంద్రాలు, పారిశ్రామికులుగా ఎదగడానికి వీ-హబ్ తదితర కార్యక్రమాలతో మహిళలను అభివృద్ధి పథంలో నడుపతున్నట్లు తెలిపారు.

మహిళా దినోత్సవంలో..

అన్నంతరం అంగన్ వాడి టీచర్లను, ఆశ వర్కర్స్ , షి టీం సిబ్బందిని శాలవ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ,మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , అంగన్ వాడి సూపర్ వైజర్లు ,అంగన్ వాడి టీచర్లు , మహిళ సోదరీమణులు , పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాట్లాఫుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here