- అభినందనలు తెలిపిన రంగా రెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు డి. ఎస్. అర్. కె ప్రసాద్
నమస్తే శేరిలింగంపల్లి: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా మొవ్వ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కి, జాతీయ కార్య వర్గ సభ్యులు మాజీ రాజ్య సభ సభ్యులు గరికపాటి మోహన్ రావుకి, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామా రంగారెడ్డికి.. రంగా రెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు డి. ఎస్. అర్. కె ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాక రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులైన మొవ్వ సత్యనారాయణకి, రవి కుమార్ యాదవ్ కి, యోగనంద్ కి అభినందనలు తెలిపారు. అంతేకాక రేపు మియాపూర్ డివిజన్ లో ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, ప్రజలతో మమేకమయ్యెందుకు వస్తున్న మొవ్వ సత్యనారాయణకి, డాక్టర్ కే నరేష్, ప్రభాకర్ యాదవ్ లకు స్వాగతం పలికారు.