నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి నగర్ లో శ్రీనిధి స్కూల్ ఆధ్వర్యంలో “హంగామా మస్తి – ఉమెన్స్ డే” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
స్కూల్ యజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరై మాట్లాడారు. “కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేశు మాత.. ఇలా సమస్తం నీవే. ఓ మాతృ మూర్తి..అంటూ ప్రతి దానిలో సగభాగం ఆడది అనే స్థాయి నుంచి ప్రతి దాంట్లో మొదటి భాగం ఆడది అనే స్థాయికి ఎదగాలని.. ఈ సందర్భంగా మహిళలందరికి మహిళా దినోత్సవం సందర్భంగా మీ కిదే మా వందనం!! అని తెలిపారు.