- వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళ ప్రముఖులను సన్మానించిన వైద్యులు శిరీష, కిరణ్
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పీజేఆర్ ఎంక్లేవ్ రహదారిలోని శిరీష నర్సింగ్ హోమ్ లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ నిర్వాహక వైద్యులు శిరీష కిరణ్ లు వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖ మహిళలు సుధా, పూర్ణిమ, సృజన, పూజ, దీపిక, విజయ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలతో నిరంతరం శ్రమించే మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఒక పైపు ఇల్లాలుగా విధులు నిర్వహిస్తూ మరోవైపు వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడానికి మహిళలు మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ఆహారం, నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.