నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మౌలికవసతులు కల్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ మొగులమ్మ కాలనీలో బస్తీలో పర్యటించగా.. స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసరావు, శశిధర్, రవి, రెహమాన్, లింగం, రఫీ, శివ, రాజా, బాలు మహిళా నాయకురాలు అరుణ పాల్గొన్నారు.