నమస్తే శేరిలింగంపల్లి : . అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లిలో గజానన్ కో-ఆపరేటివ్ సొసైటీలో అవంతిక గోదావరి అపార్ట్మెంట్స్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతిక గోదావరి అపార్ట్మెంట్స్ వాసులు తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పూర్తయిన ప్రాంతాల్లో సీసీ రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గంగాధర్ రెడ్డిని కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. అందుకు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు.
పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. సమస్యలను ఒక్కొకటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ఆదర్శవంతమైన గచ్చిబౌలి డివిజన్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతీ బస్తీ, కాలనీల్లో కోట్ల నిధులు వెచ్చించి మంచినీరు, రోడ్లు, కరెంటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అవంతిక గోదావరి అపార్ట్మెంట్స్ వాసులు శ్రవణ్ కుమార్, భాను ప్రకాష్, సందీప్, రామ కృష్ణ, నగేష్, కిరణ్, సంపత్, కరుణ, సారంగ, ప్రసాద్ రావు, ఇమ్రాన్ పాల్గొన్నారు.