- చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని మై హోమ్ భుజలో పలు కాలనీ అసోసియేషన్ సభ్యులతో అల్పాహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి మాటే లేకుండా పోయిందన్నారు. సంక్షేమ పథకాలు కనుమరుగయ్యాయన్నారు. కార్పొరేట్ శక్తుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.