అభివృద్దే ప్రధాన ఎజెండా : ప్రభుత్వ విప్ గాంధీ

  • మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 3 కోట్ల 15 లక్షల 40 వేల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు
  • శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్దే ప్రధాన ఎజెండాగా పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీ అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతామని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ లో రూ. 3 కోట్ల 15 లక్షల 40 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.


సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తీలో రూ.32 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు , భిక్షపతి నగర్ బస్తీలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో.. ఆదిత్య నగర్ బస్తీలో రూ.49.50 లక్షల అంచనా వ్యయంతో .. శిల్ప హిల్స్, కాకతీయ హిల్స్, మాదాపూర్ డివిజన్ నందు అనేక చోట్లా రూ.49.90 లక్షల అంచనా బి.టి నిర్మాణ పనులు, సిద్ధివినాయక నగర్ , దోబీ ఘాట్ నందు రూ.95 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు, గుట్టల బేగంపేట, అయ్యప్ప సొసైటీ నందు రూ.69 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మధుసూదన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సాంబశివరావు, ఎస్.సి సెల్ అధ్యక్షులు ఓ.కృష్ణ, శ్యామ్, మహేష్, అంకా రావు, రాములు యాదవ్, సత్యనారాయణ, నర్సింహ, లోకేష్, బాబూమియా, వార్డ్ సభ్యులు శ్రీనివాస్, రామచందర్, ముక్తర్, మునఫ్ ఖాన్, కసిమ్, మియన్, లియకత్, సలీం, రెహ్మాన్, కృష్ణ యాదవ్, అప్పల్ రాజు యాదవ్, ఖాజా, వెంకటేష్, రఘునందన్, రందస్, రాంజనేయులు, సుబ్రహ్మణ్యం, బాబు రావు, వన్నూరు, నర్సింహ మూర్తి, సత్యనారాయణ, పరమేష్, గంగ బాబు, నగరాజ్, వెంకన్న, రాములు, వెంకటేశ్వర్లు, హరి, మహేష్, కొండయ్య, గిరి బాబు, హున్య నాయక్, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సోమేశ్వర్ రావు, జనార్దన్ రెడ్డి, సుబ్బా రావు, ఓ.అశోక్, ఆశయ్యా, గోపాల్ రెడ్డి, లింగం గుప్త, బాలరాజు గుప్త, కసిమ్, వెంకటేష్, ఈశ్వర్ మహిళలు శశిరేఖ, బుజమ్మ, శ్రీజ రెడ్డి, కృష్ణ వేణి, మొగులమ్మ, లక్ష్మీ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here