నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణం తమని ఎంతగానో కలచివేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని వార్డ్ కార్యాలయం నందు వారి చిత్రపటానికి బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. సాయిచంద్ మరణం తమని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, గౌరవ అధ్యక్షులు లక్ష్మ రెడ్డి, వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, ఎస్.సి సెల్ అధ్యక్షులు కంది ఙ్ఞానేశ్వర్, సుదర్శన్, మల్ల రెడ్డి, ప్రవీణ్, కృష్ణ, వెంకట్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, మల్లేష్, దామోదర్ రెడ్డి, సంజు సాగర్, సుదేశ్, ముజీబ్, మనోహర్, మహిళలు భాగ్యలక్ష్మి, శ్రీదేవి పాల్గొన్నారు.