నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జనగాం నుండి విచ్చేసిన పేరిణి లాస్యం, ఆంధ్రనాట్యం గురువర్యులు పేరిణి సంతోష్ శిష్య బృందం పేరిణి నాట్యంలో పుష్పాంజలి, వినాయక గద్యం, పేరిణి శివతాండవం, మూషిక వాహన, బ్రహ్మ గద్య, శబ్ద పల్లవి, సంధ్య తాండవం, శంకర శిరిజ, నమో నమో నటరాజ, సరస్వతి స్తుతి, సమీకరణం, దేవి కైవారం, మొదలైన అంశాలను శివ ప్రియా, అక్షిత లాస్య, శరణ్య, శ్రద్ధ, పూజిత, అనన్య, సంవిక , దీక్షిత, అమృతవర్షిణి , అభిలాషిని, లక్ష్మి ప్రణవి, నాగ శివాని, సహస్ర, రమ్య, సాత్విక్ మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
