నమస్తే శేరిలింగంపల్లి: 10వ తరగతి పరీక్షా ఫలితాల సాధనలో శ్రీ చైతన్య స్కూల్ నల్లగండ్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. వీరిలో అద్వైత్ 488/500, సిహెచ్. యశ్వంత్ 488/500, టి. ఆర్యస్ 488/500 మార్కులను సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. దివ్య సాయి శర్వాణి 482/500 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలోనూ, నిరాలి చంద్రస్ 476/500, మానసి సంజయ్ అంబేకర్ 476/500 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. 480 మార్కులు ఆ పైన మార్కులు సాధించినవారు 7గురు, 480 – 470 మధ్య మార్కులు సాధించిన వారు 11 మంది, ఉత్తమ ఫలితాలు సాధించి వారి ప్రతిభను చాటారు. వారందరికీ శ్రీ చైతన్య స్కూల్, నల్లగండ్ల శాఖలో అభినందన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యు. వాణి మాట్లాడుతూ అన్ని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే శ్రీ చైతన్య విద్యాసంస్థల లక్ష్యమని, ఇంతటి ఘన విజయానికి కారణమైన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను మెచ్చుకుంటూ ఆశీస్సులను ఇస్తూ పై తరగతులలో కూడా మంచి క్రమశిక్షణ కలిగి ఉత్తమ ఫలితాలు సాధించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శివరామకృష్ణ, ఆర్.ఐ అనిత, డీస్ కోటేశ్వరరావు సి ఇంచార్జ్ మౌనిక, టెన్త్ క్లాస్ ఇన్చార్జ్ ఎం. కె. రంగా, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.