నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి త్రివేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినులు పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. పి. దీక్షిత రెడ్డి 10/10, ఎం.ఎస్ రిత్విక 9.8/10, జి. మాలిక 9.8/10 పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభను కనబర్చినందుకు పాఠశాలకు, మీ తల్లితండ్రులకు ఎంతో గర్వకరణం అని అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఈ సందర్బంగా విద్యార్థిలకు మంచి క్రమశిక్షణ, విద్యను భోదించిన ఉపాధ్యాయులను ప్రశంశించారు.
