నమస్తే శేరిలింగంపల్లి : మతిస్థిమితం లేని ఓ వృధ్ధురాలు కిష్టమ్మ (60) అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. ఎంఏనగర్ లో నివాసం ఉంటున్న కిష్టమ్మ 15వ తేదీ ఉదయం తన ఇంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తన బంధువులు చుట్టూపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. వివరాలకు 9553474459, 9381867314 సంప్రదించాలని తెలిపారు.