నమస్తే శేరిలింగంపల్లి : ఓ వృద్ధుడు చిరునామా తెలియక అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. 17వ తేదీన ఉదయం ప్రగతి ఎంక్లేవ్ నుంచి చిన్న వెంకటేశ్వర్లు (55) ఇంటి నుండి వెళ్లిపోయాడు. వెంకటేశ్వర్లు గురించి ఎక్కడా వెతికినా ఆచూకీ లభించలేదని తన బంధువులు తెలిపారు. ఆయన మియాపూర్ కి వచ్చి 5 రోజులే అవుతుందని తన బంధువులు తెలిపారు.
వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన వైచర్లపల్లి వాసి అని మియాపూర్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. వివరాలకు 9553474459, 9381867314 సంప్రదించాలని తెలిపారు.