నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ పీఎస్ పరిధిలోని చంద్ర నాయక్ తండాలో ఎస్ కన్వెన్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లిఫ్ట్ గుంతలో పడి గుర్తు తెలియని మరణించాడు. లిఫ్ట్ గుంతలో పడిన వ్యక్తి (30-40)మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు.

బ్లాక్ కలర్ పాయింట్, స్వెటర్, రెడ్ కలర్ టీ షర్ట్, పారగాన్ స్లిప్పర్స్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఎత్తు సుమారు 5.2 ఉంటాడని, చామన చాయ రంగు కలిగి, నలుపు తెలుపు రంగు వెంట్రుకలు గడ్డం కలిగి, అతడి కుడి చేతికి ఎరుపు రంగు దారం ఉన్నదని, మృతుని ప్యాంటు జేబులో మెన్షన్ హౌస్ క్వాటర్ బాటిల్ (సగం కంటే తక్కువ ) ఉన్నదని తెలిపారు. మద్యం సేవించి ప్రమాదవశాత్తు లిఫ్ట్ గుంతలోకి జారిపడి చనిపోయినట్లుగా తెలుస్తున్నట్ల వెల్లడించారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు మాదాపూర్ పీఎస్ ను ఈ నంబర్లలో 87125 68360, 94906 17182 సంప్రదించాలని పోలీసులు తెలిపారు.





