- మియాపూర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు తాడి బోయిన రామస్వామి యాదవ్ వినతి
నమస్తే శేరిలింగంపల్లి: పాదచారుల సౌకర్యార్థం క్రాస్ వాక్ ఏర్పాటు చేయాలని మియాపూర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు మంగళవారం మాజీ కౌన్సిలర్, శేరిలింగంపల్లి పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ వినతి పత్రం అందించారు. పూణే హైదరాబాద్ జాతీయ రహదారిపై చందానగర్ గాంధీ విగ్రహం దగ్గర, గంగారం హనుమన్ గుడి దగ్గర క్రాస్ వాక్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ వినతి పత్రాన్ని ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావుకి అందజేశారు. పాదచారులు భద్రత ను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.