గౌలిదొడ్డి శివాలయంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి శివాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సకుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున సకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ శివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, భక్తులు, బస్తి వాసులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

గౌలిదొడ్డి శివాలయంలో సకుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
గౌలిదొడ్డి శివాలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here