మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని ఎంఏ నగర్‌లో ఉన్న తాండ్ర రామచంద్రయ్య స్మారక భవనంలో గురువారం ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశం నిర్వహించారు. నాయకుడు యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ త్వరలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వేముల తిరుమలకు ఓటు వేసి గెలించాలన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) బలపరిచిన వేముల తిరుమలకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, సుకన్య, గ్రేటర్ కార్యదర్శి వి.తుకారాం నాయక్, సహాయ కార్యదర్శి గడ్డమీది హరినాథ్ గౌడ్, కమిటీ సభ్యులు మైదంశెట్టి రమేష్, టి.అనిల్ కుమార్, కన్నా శ్రీనివాస్, లక్ష్మణ్, తాండ్ర కళావతి, పల్లె మురళి, ఎం.యాదగరి కుమార్, పి.శ్యాం సుందర్ పాల్గొన్నారు.
