- సగరులకు న్యాయం చేస్తాం
- కోకాపేటలో ముందు కేటాయించిన స్థలమే కొనసాగిస్తాం
- మంత్రి గంగుల కమలాకర్ హామీ
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సగర జాతికి కోకాపేటలో ముందుగా కేటాయించిన వంద అడుగుల రోడ్డుకే ఆత్మ గౌరవ భవన స్థలాన్ని కొనసాగిస్తామని తెలంగాణ బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కోకాపేటలో సగరులకు కేటాయించిన స్థలాన్ని మారుస్తూ లే-అవుట్ రూపొందించడంతో సగర సంఘం రాష్ట్ర కమిటీ హై కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వం తరపున సగర సంఘాన్ని మంత్రి గంగుల కమలాకర్ గురువారం చర్చలకు ఆహ్వానించారు. సంఘం రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి మాట్లాడుతూ సగరులకు అవమానం జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్లాట్ నంబర్ మాత్రమే మార్చడంతో సమస్య ఏర్పడిందని, సరి చేసి మందుగా కేటాయించిన ప్లాట్ ను సగరులకు కేటాయించేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్ లో అన్ని విషయాలలో సగరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రితో జరిగిన చర్చలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, ప్రధాన కార్యధర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల భిక్షపతి సగర, ఉపాధ్యక్షులు శెన్చెట్టి విజయేంద్ర సగర, ఎం.రాములు సగర, కార్యనిర్వాహక కార్యదర్శి ఆంజనేయులు సగర, సంఘం సీనియర్ నాయకుడు కట్టా రాఘవేందర్ రావ్ సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు పెద్దబుద్దుల సతీష్ సగర, కోశాధికారి సందుపట్ల రాము సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి సగర, గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతీయ సంఘాల నాయకులు హాజరయ్యారు.

