ప్ర‌జ‌ల‌కు మెరుగైన మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తాం: కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ డివిజ‌న్ ప‌రిధిలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. సోమ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని అయ్యప్ప సొసైటీ అసోసియేషన్ కార్యాలయంలో కాలనీ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మధుసూదన్ రెడ్డి, జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ ఏఈ ప్రశాంత్ ల‌తో క‌లిసి అయ్యప్ప సొసైటీ కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాల‌నీలో పెండింగ్‌లో ప‌నులను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌న్నారు. అలాగే 60 ఫీట్ల రోడ్డులో జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన యూజీడీ ప‌నులను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని అన్నారు.

అయ్యప్ప సొసైటీ అసోసియేషన్ కార్యాలయంలో కాల‌నీ నాయ‌కులు, అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

జ‌ల‌మండ‌లి అధికారుల‌తో స‌మావేశం…
హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జ‌ల‌మండ‌లి కార్యాలయంలో హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల‌ పరిధిల‌లో చేప‌ట్టాల్సిన‌ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, పెండింగ్‌లో ఉన్న మంజీరా పైప్ లైన్ పనులపై జీఎం రాజశేఖర్, హఫీజ్ పేట్ డివిజన్ డిజిఎం నాగప్రియ, మాదాపూర్ డివిజన్ డిజిఎం శ్రీమన్నారాయణ, మేనేజర్ సుబ్రమణ్యంల‌తో క‌లిసి కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌లు సమీక్ష సమావేశం నిర్వహించారు.

జ‌ల‌మండ‌లి అధికారుల‌తో స‌మావేశంలో పాల్గొన్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here