నేతాజీన‌గ‌ర్‌లో మ్యాన్‌హోల్స్‌కు మ‌ర‌మ్మ‌త్తులు

గ‌చ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని నేతాజీన‌గ‌ర్ కాల‌నీలో శిధిలావస్థకు చేరుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మ్యాన్‌హోల్స్ కు కాలనీ అసోసియేష‌న్‌ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ సోమ‌వారం ద‌గ్గ‌రుండి మ‌ర‌మ్మ‌త్తులు చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాల‌నీలో కొన్ని వీధుల్లో మ్యాన్ హోల్స్ శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయ‌న్నారు. అందువ‌ల్లే వాటికి మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. కాల‌నీ వాసులు ఓపెన్ నాలాలు, డ్రైనేజీల్లో చెత్త‌ను వేయ‌కూడ‌ద‌ని, అప్పుడే కాల‌నీ ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉంటాయ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు రమేష్ నాయక్, పంతం వెంకటేష్, శీను, బసవయ్య, టి కుమార్ ముదిరాజ్, దశరథ్ యాదవ్, యూత్ నాయకులు లవణ చారి, చంద్రశేఖర, నరేష్, అంకమ్మరావు, సురేష్ పాల్గొన్నారు.

ద‌గ్గ‌రుండి మ్యాన్ హోల్స్‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయిస్తున్న భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here