కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. గురువారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో పలు వీధులలో పాదయాత్ర చేసి సమస్యలను తెలుసుకున్నారు. ప్రేమ్ నగర్ ఎ బ్లాకు సాయిరాం స్కూల్ వీధిలోని ఓపెన్ నాలా డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి, త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రజల కోరుకునే విధంగా మౌలిక వసతులు ఏర్పాటు చెయ్యటం జరుగుతున్నదని, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు లేని డివిజన్ గా తీర్చి దిద్దటానికి తీవ్ర కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏరియా కమిటీ మెంబర్ హిమామ్, తెరాస సీనియర్ నాయకులు మహ్మద్ ఉస్మాన్, ఖాజా భాయ్, జావిద్, రాజు, మాఝర్, యూత్ నాయకులు దీపక్, మహ్మద్ నసీరుద్దీన్, వెంకటేష్, అఖీల్, కిషన్ ఉన్నారు.