నేతాజీన‌గ‌ర్ లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాలి: భేరి రామచందర్ యాదవ్

గ‌చ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నేతాజీ నగర్ లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ప‌రిశీలించారు. కాల‌నీలో కొన్ని వీధుల్లో యూజీడీ, సీసీ రోడ్లు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని కాల‌నీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ క్ర‌మంలో జిహెచ్ఎంసి సూపర్ వైజర్ విశ్వనాథ్‌, ప‌లువురు సిబ్బందితో క‌లిసి కాల‌నీలో ప‌ర్య‌టించారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించారు. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కాలనీ యువజన విభాగం అధ్యక్షుడు కే రాము యాదవ్, కృష్ణమూర్తి, అడివయ్య, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, కాలనీవాసులు పాల్గొన్నారు.

కాల‌నీలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలిస్తున్న జిహెచ్ఎంసి సూపర్ వైజర్ విశ్వనాథ్, భేరి రామచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here