మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద మంజీరా పైపులైన్ పగిలిపోవడంతో జలమండలి డీజీఎం నాగప్రియ, వర్క్ ఇన్‌స్పెక్టర్ రమేష్ లతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ దగ్గరుండి మరమ్మత్తు పనులను చేయించారు. అలాగే మియాపూర్‌లోని జాతీయ రహదారిపై కొనసాగుతున్న మ్యాన్ హోల్ కవర్ క్లోజింగ్ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ఉపాధ్యక్షుడు మహేందర్ ముదిరాజ్, రాంచందర్ గౌడ్ పాల్గొన్నారు.