శేరిలింగంపల్లి, జనవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ D. శశి రేఖతోపాటు రెవెన్యూ సెక్షన్ ఏఎంసీ మణికరణ్, టీపీఎస్ రమేష్, ఎస్‌డబ్ల్యూఎం డీఈ వశీధర్, ఏఎంవోహెచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఎస్ శ్రీనివాస్, ఇంజినీరింగ్ సెక్షన్ శ్రీదేవి, ఎంటమాలజీ సెక్షన్ ఆర్.చిన్నా, వెటర్నరీ సెక్షన్ టి.సంజయ్ రెడ్డి, యూబీడీ సెక్షన్ రాజేశ్వరి, యూసీడీ సెక్షన్ ఎ.విజయలక్ష్మి, ఎలక్ట్రికల్ సెక్షన్ శివ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజావాణిలో భాగంగా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు విభాగాల్లో అందజేసిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్‌లో 1, ఇంజినీరింగ్ విభాగంలో 1 ఫిర్యాదు మొత్తం కలిపి ప్రజావాణికి 2 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వెంటనే ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు DC శశి రేఖ ఆదేశాలు జారీ చేశారు.






