మక్తామహబూబ్‌పేటలో TRP నూతన కమిటీ ఏర్పాటు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి మక్తా మహబూబ్‌పేట డివిజన్‌లో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడిగా భట్టు రాజును నియమించారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు భట్టు రాజు పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, డివిజన్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తమహబూబ్‌పేట డివిజన్‌లో భారీ సంఖ్యలో ప్రజలు టిఆర్పిలో చేరడం విశేషం. పార్టీలో చేరిన వారిలో పి. సరోజమ్మ, పీవీ రమణ, ఎస్‌కే అలిసాబ్, కమ్మరి వెంకటలక్ష్మి, ఎస్‌కే బిస్మిల్లా బేగం, పి.విజయ్ కుమార్, పీ మేఘన త‌దిత‌రులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here