నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యమకారులకు నేటి తెలంగాణ రాష్ట్రంలో కనీస మర్యాద కరువైందని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో నివసిస్తున్న నరసింహను శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు కలిశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు కనీస గుర్తింపు లేదన్నారు. ఉద్యమకారులు అంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, రాజేందర్, ఉమేష్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.