నమస్తే శేరిలింగంపల్లి: నేటి యాంత్రిక జీవన శైలిలో ఆధ్యాత్మికత అవసరమని, దైవ చింతనతో మానసిక ప్రశాంతత అలవడుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. దైవ చింతనలోనే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని, నేటి యాంత్రిక జీవనంలో మనస్సుకు ప్రశాతత ఎంతో అవసరమని, ప్రతి రోజు దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలని, అలాగే దేవాలయాల నుంచి వచ్చే ఆధ్యాత్మిక శక్తి మనుషులలో మానవత్వాన్ని పెంచుతుందన్నారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు చిన్న, క్రాంతి భక్తులు, స్థానికులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.